సూర్యాపేటలో అంబరాన్ని అంటిన సంబరాలు
సూర్యాపేటలో సంబరాలు అంబరాన్ని అంటాయి.సూర్యాపేటను జిల్లా కేంద్రం గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా లో సంబరాలు చేశారు.దీంతో జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చుతూ..భారీ ర్యాలీ తీశారు.
మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు,టీ ఆర్ యస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు సూర్యాపేట లో జరిగిన 'సమరభేరి 'సదస్సులో ఇచ్చిన మాటను నిలుపు కున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీరాజనాలు పలుకుతున్నారు.2014 ఎన్నికలలో అధికారం లోకి వస్తే సూర్యాపేట ను జిల్లా కేంద్రంగా మార్చడంతో పాటు ఆ ఎన్నికలలో జగదీష్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న కేసీఆర్...అన్న మాటను నిలబెట్టుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు.దీంతో పాటు సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలన్న సంకల్పాన్ని నెరవేర్చిన మంత్రి జగదీష్ రెడ్డిని కొనియాడుతున్నారు.
దీంతో సూర్యాపేటలో పెద్దయెత్తున బాణసంచాలు కాలుస్తూ తెలంగాణ తల్లి విగ్రహం వద్దనుండి మొదలైన ర్యాలీ కొత్తబస్ స్టాండ్,శంకర్ విలాస్ సెంటర్ మీదుగా పాతబస్స్టాండ్ కు చేరుకుంది .ఈ ర్యాలీలో గండూరి ప్రవల్లిక ప్రకాష్.సీనియర్ నేత వై.వి,మారిపేద్ది శ్రీనివాస్ గౌడ,నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఆకుల లవకుశ పాల్గొన్నారు.దారి పోడుగున ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కు పుష్పాభిషేకం చేసారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి